సమంత పై బోలెడు పుకార్లు

సమంత పై బోలెడు పుకార్లు

0
106

ఎప్పుడు ఎదో ఒక విషయంలో వార్తల్లో ఉండే సమంత మీద ఇప్పుడు బోలెడు పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇంతకూ ముందు సమంత సినిమాలో నుంచి బ్రేక్ తీసుకుని పిల్లల కోసం ప్లాన్ చేయడానికి సిద్ధం అవుతోందని వార్తలు వినిపించాయి. కానీ కొద్దీ రోజుల్లోనే సమంత షూటింగ్లో బిజీ అయిపోవడంతో ఆ వార్తలకు పులిస్టాప్ పడింది.

అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అక్రో బయాటిక్స్ చేస్తూ వీడియోను పోస్ట్ చేస్తున్న సమంత ఇప్పుడు ఒక యాక్షన్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ లో నటించ బోతోందని తెలుస్తుంది. డిజిటల్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ ఈ వెబ్ సిరీస్ నిర్మించానుందట. అయితే మరో వైపు సమంత హీరోయిన్ సెంట్రింగ్ సినిమాలు చేసి బోర్ కొట్టిందని ఒక రెండు కమర్షియల్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తోందని మరి కొందరు చెబుతున్నారు.

ఇంకో వైపు నాగార్జున బంగార్రాజు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఆ సినిమాలో నాగచైతన్య కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈమె సినిమాల్లో సామ్ గెస్ట్ పాత్రలో కనిపించనుందట. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజ నిజాలు ఉన్నాయో ఇంకా తెలియాల్సి ఉంది.