ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయకు బంపర్ ఆఫర్

ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయకు బంపర్ ఆఫర్

0
94

ఒక్క సినిమా మన జీవితాన్ని మార్చేస్తుంది అంటారు అవును చాలా మంది హీరోలు, అలాగే ఫామ్ లోకి వచ్చినవారే… ఆర్ ఎక్స్ 100 చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు హీరో కార్తికేయ. తాజాగా 90 ఎం.ఎల్ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించాడు కార్తికేయ. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితం దక్కలేదు..

ఇక ఈ ఏడాది ఆయన ఖాతాలో భారీ హిట్స్ లేవు అనే చెప్పాలి.. కాని తాజాగా ఈ హీరోకి మరో బంపర్ ఆఫర్ వచ్చింది అనే వార్త టాలీవుడ్ లో వైరల్ అవుతోంది. ఒక పెద్ద నిర్మాత తన నిర్మాణ సంస్థలోనే కార్తికేయతో సినిమాను నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

అంతేకాదు కథ గురించి దర్శకుడితో చర్చలు అయ్యాయట.. కార్తి తో కూడా సంప్రదింపులు అయ్యాయి అని తెలుస్తోంది.. పెద్ద నిర్మాణ సంస్ధ కావడంతో ఈ సినిమా చేసేందుకు ఆయన కూడా ఒకే చెప్పారని తెలుస్తోంది. కథలో పాయింట్ కార్తికేయకు నచ్చిందట.. త్వరలో ఈ సినిమా పేరు అనౌన్స్ చేస్తారు అంటున్నారు టాలీవుడ్ ప్రముఖులు