12 నిమిషాల శాండ్ ఫైట్.. ఎలా ఉంటుందో

12 నిమిషాల శాండ్ ఫైట్.. ఎలా ఉంటుందో

0
94

యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సుజిత్ కాంబినేషన్లో యూవీక్రియేషన్స్ వారు నిర్మిస్తున్న సినిమా సాహో.. ఈ నెల ౩౦ న భారీ రేంజ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే ఓ రేంజ్లో చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా రాబోతున్న ఈ సినిమాలో 12 నిమిషాల సీన్ మాత్రం మాస్ ఆడియన్స్ కు బాగా నచ్చేస్తుందట. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ సీట్లలో కూర్చోవడం కష్టమే అని తెలుస్తుంది. సాహోలో ప్రిఖైమాక్స్ లో 12 నిమిషాల శాండ్ ఫైట్.. ఉంటుందట. ఆ ఫైట్ మాములుగా ఉండదని అంటున్నారు.

ఆ ఒక్క ఫైట్ కోసం 80 కోట్ల దాకా ఖర్చు పెట్టారని తెలుస్తుంది. మరి ప్రీ క్లైమాక్స్ ఫైట్ ఆ రేంజ్ లో ఉంటె ఇక క్లైమాక్స్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చూ. సాహోతో ప్రభాస్ మరో సెన్సేషన్ సృటించడం ఖాయమని ఫిక్స్ అవ్వచ్చు మరి సినిమా అసలు ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే మరో 10 రోజులు వెయిట్ చేయాలి