తెలుగులో సెంటిమెంట్.. దుబాయ్ లో సెన్సేషన్. సాహూ

తెలుగులో సెంటిమెంట్.. దుబాయ్ లో సెన్సేషన్. సాహూ

0
92

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సాహూ ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దాదాపుగా 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ భారీ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కోసం భారీ ఎత్తున ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఇందులో భాగంగా దేశంలోని నాలుగు ప్రధాన నగరాలలో – హైదరాబాద్, ముంబై, బెంగళూరు, కొచ్చి, చెన్నైలో ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు. ఆ నగరాలలో ప్రభాస్ అక్కడి మీడియాతో మాట్లాడతాడు. హైదరాబాద్ లోని ఈవెంట్ ఎల్బీ స్టేడియంలో చెయ్యాలని అనుకున్నారు.

ఎల్బీస్టేడియంలో చివరిగా భరత్ అనే నేను ఈవెంట్ జరిగింది. అయితే ఇప్పుడు సాహూ ఈవెంట్ ఎల్బీస్టేడియంలో కాకుండా రామోజీ ఫిలిం సిటీలో చేద్దాం అనుకుంటున్నారు. ప్రభాస్ బాహుబలి 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్ గతంలో రామోజీ ఫిలిం సిటీలోనే జరిగింది. ఇప్పుడు సెంటిమెంట్ గా సాహూ ఈవెంట్ కూడా అక్కడే చేద్దాం అని నిర్మాతలు ఫిక్స్ అయ్యారట. దీనికి ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కుష్ అయ్యారు. ఈ ఐదు ఈవెంట్లతో పాటు దుబాయ్ లో కూడా ఒక మెగా ఈవెంట్ ప్లాన్ చేస్తుంది చిత్ర బృందం.