Sai Dharam Tej |`సాయితేజ్ ప్రపోజల్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్!

-

మెగా హీరో సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సుదీర్ఘ విరామం తర్వాత ప్రస్తుతం విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 21న ఈ సినిమా విడుదల కానుంది. సాయితేజ్(Thikka) సరసన సంయుక్తా మీనన్(Samyuktha Menon) నటించింది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్‌లో సాయితేజ్ ఆసక్తికర విషయాలు మీడియాతో పంచుకున్నారు. రోడ్డు ప్రమాదం తర్వాత కోలుకున్నాక తనలో అనేక మార్పులు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఉన్నది ఒక్కటే జీవితం.. నవ్వుతూ.. నవ్విస్తూ బతకాలని డిసైడ్‌ అయినట్లు తెలిపారు. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని.. అందరిలాగే తనకూ కొన్ని బ్రేకప్స్ ఉన్నాయని చెప్పారు. సినిమా ఇండస్ట్రీకి వచ్చాక ‘తిక్క’ సినిమా హీరోయిన్ లారిస్సా బోనేసిని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడ్డాను. సాంగ్‌ షూటింగ్‌ సమయంలో ‘నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఒప్పుకుంటే డేటింగ్‌ చేద్దాం’ అని డైరెక్ట్‌గా అడిగేశా. కానీ ‘సారీ తేజ్‌(Sai Dharam Tej).. నాకు బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడు’ అని చెప్పింది’ అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -
Read Also: ‘పుష్ప’ ప్రొడ్యూసర్లపై ఐటీ కన్ను.. అక్కడ వందల కోట్ల విలువైన భూములు కొన్నట్లు గుర్తింపు!

Follow us on: Google News, Koo, Twitter

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...