విజయ్ తో ముద్దు వల్లే డియర్ కామ్రేడ్ ని సాయి పల్లవి వద్దందట..!!

విజయ్ తో ముద్దు వల్లే డియర్ కామ్రేడ్ ని సాయి పల్లవి వద్దందట..!!

0
103

తొలి సినిమాతోనే టాలీవుడ్ ఆడియన్స్‌ను ‘ఫిదా’ చేసిన బ్యూటీ సాయి పల్లవి . తెలుగుతో పాటు మాలీవుడ్, కోలీవుడ్‌లలోనూ ఫుల్ ఫాంతో దూసుకుపోతున్న ఈ భామ ఓ క్రేజీ హీరో సినిమాలో అవకాశం వచ్చినా నో చెప్పారట. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం డియర్‌ కామ్రేడ్‌.

ఈ సినిమాలో హీరోయిన్‌గా ముందుగా సాయి పల్లవి సంప్రదించారట. అయితే ముద్దు సన్నివేశాలు ఉండటంతో ఆ సినిమాను సాయి పల్లవి తిరస్కరించినట్టుగా ప్రచారం జరుగుతోంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎక్కువగా నటనకు అవకాశం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ వస్తున్న ఈ భామ ఎక్స్‌పోజింగ్‌, ఇంటిమేట్‌ సీన్స్‌కు దూరంగా ఉంటున్నారు. అందుకే డియర్‌ కామ్రేడ్‌ లాంటి క్రేజీ ప్రాజెక్ట్‌ను కూడా వదులుకున్నట్టుగా తెలుస్తోంది.

విజయ్‌ దేవరకొండ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న డియర్‌ కామ్రేడ్ ఈ నెల 26 ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినమాతో భరత్‌ కమ్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.