పెళ్ళై పిల్లలున్న వ్యక్తితో డేటింగ్‌పై సాయిపల్లవి క్లారిటీ

-

సాయి పల్లవి(Sai Pallavi) ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. నేచురల్ బ్యూటీగా తెలుగు తమ్ముళ్లు తమ గుండెల్లో పెట్టుకున్నారు. అటువంటి ఈ ముద్దుగుమ్మ గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియా తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఎర్ర బుగ్గల చిన్నది.. పెళ్ళై పిల్లలున్న ఓ హీరోతో డేటింగ్‌లో ఉందని, వచ్చే ఏడాది ఏడడుగుల బంధంలోకి అడుగు పెట్టాలని కూడా వీరు ప్లాన్ చేసుకుంటున్నారని తమిళ మీడియాలో కూడా తెగ ప్రచారం జరుగుతోంది. ఈ విషయం విన్న కుర్రకారంతా గుండె బద్దలై బ్రేక్ సాంగ్స్‌ను వరుస పెట్టి వినేస్తున్నారు. తాజాగా విషయంపై సాయి పల్లవి క్లారిటీ ఇచ్చింది.

- Advertisement -

‘‘తాజాగా మీడియాలో చాలా వార్తలు వింటున్నాను. నాపైన కూడా కొందరు కారు కూతలు కూస్తున్నారు. నేను ఎవరో పెళ్లైన హీరోతో డేటింగ్‌లో ఉన్నానని ప్రచారం చేస్తున్నారు. అసలు నేను పెళ్లైన హీరోతో డేటింగ్ చేయడం ఏంటి? ఇది నాకే షాకింగ్‌గా ఉంది. వాటిల్లో ఏమాత్రం వాస్తవం లేదు. అవన్నీ తప్పుడు ప్రచారాలే. ఇలాంటి వాటిని ఎవరూ నమ్మొద్దు. ఇలాంటి రూమర్లను క్రియేట్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని చెప్పారామే. ఈ వార్త విన్న ఆమె(Sai Pallavi) ఫ్యాన్స్ అంతా మళ్ళీ ఊపిరి పీల్చుకున్నారు.

Read Also: ‘తులసి’తో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...