Sai Pallavi |ఎక్స్‌పోజ్ చేయకూడదని అప్పుడే నిర్ణయించుకున్నా: సాయి పల్లవి

-

సినిమా ఫీల్డ్ అంటేనే ఒళ్లంతా చూపించుకోవాలని చాలా మంది భావిస్తారు. అందులోనూ హీరోయిన్లు అయితే.. ఇంకా దారుణంగా అనుకుంటారు. సినిమా కోసం అవసరమైతే నగ్నంగా కూడా కనిపించడానికి ఓకే అనే పనైతేనే ఈ రంగుల లోకంలో రాణించగలమని, హీరోయిన్లు అంటేనే అలా ఒళ్లు చూపించుకుని గడిపేవారని కొందరు బాహాటంగానే అంటుంటారు. సినీ ఫీల్డ్ జరిగే కాస్లింగ్ కోచ్ ఘటనలు వారి వాదనలకు బలం చేకూరుస్తుంటాయి కూడా. అలాంటిది ఈ సినిమా ఫీల్డ్‌లో కూడా ఏమాత్రం ఎక్స్‌పోజ్ చేయకుండా అభిమానులను ఆకట్టుకున్న ఏకైక హీరోయిన్ సాయిపల్లవి(Sai Pallavi).

- Advertisement -

ఏ సినిమాలో కూడా సాయి పల్లవి క్లీవేజ్ అనేది కనిపించదు. ఫిదా సినిమాలో చిన్న సీన్ కోసం స్కర్ట్‌లో కనిపించడమే తప్ప మరే ఇతర సినిమాలో కూడా నడుమును కూడా ఎకస్‌పోజ్ చేయకుండా కుర్రకారును కట్టిపడేస్తోంది ఈ ఎర్రబుగ్గల చిన్నది. అయితే సినిమా ఫీల్డ్‌లోకి వచ్చి ఎక్స్‌పోజ్‌కు దూరంగా ఉండాలన్న సాయి పల్లవి డెడికేషన్‌కు చాలా మంది అభిమానులు ఉన్నారు. కాగా తాను ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణాన్ని వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ. తాను ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా పెద్ద కారణం ఉందని, ఎంతో బాధ కూడా దాగి ఉందని చెప్పింది సాయి పల్లవి.

‘‘సినిమాల్లోకి రాకముందు వైద్య విద్య కోసం జార్జియా వెళ్లా. అక్కడ టాంగో డాన్స్ నేర్చుకున్నా. ఆ డాన్స్ కోసం ప్రత్యేక కాస్ట్యూమ్ వేసుకోవాల్సి ఉంటుంది. వాటిలో సౌకర్యంగా ఫీల్ అయిన తర్వాతే డాన్స్ నేర్చుకోవడానికి ముందడుగు వేశాను. కొంతకాలానికి ‘ప్రేమమ్’ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశా. ఆ సినిమా విడుదలైన తర్వాత నేను టాంగో చేసిన వీడియో ఒకటి వైరల్ అయింది. ఈ వీడియోకు చాలా కామెంట్స్ వచ్చాయి. వాటిలో నెగిటివ్ కామెంట్స్ కూడా ఉన్నాయి. అవి ఎంతో బాధించాయి. అప్పుడే ఇంకెప్పుడూ కూడా శరీరం కనిపించేలా దుస్తులు వేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. రానురాను అది ఒక నియమంలా మారిపోయింది. దాని వల్ల సినిమా అవకాశాలు తగ్గాయా? అంటే నేను చెప్పలేను. నా నటనపై నమ్మకం ఉంచి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నా. మనసుకు నచ్చిన పాత్రలు చేస్తున్నాను’’ అని అసలు విషయం చెప్పింది సాయి పల్లవి(Sai Pallavi).

Read Also: హెయిర్ ఫాల్‌కు అద్భుత చిట్కాలు.. ఇవి వాడితే రాలమన్నా జుట్టు రాలదు..!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...