వరంగల్ బస్టాండ్ లో సాయి పల్లవి!

వరంగల్ బస్టాండ్ లో సాయి పల్లవి!

0
139

హీరోయిన్ సాయిపల్లవి నటించిన కొన్ని సినిమాలు ఫెయిల్ అయినా ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆమె బయటికి వస్తే చూడటానికి జనం ఎగబడతారు. అయితే ఈమధ్య ఆమె బస్టాండ్ లో నిలబడి బస్ కోసం ఎదురుచూస్తున్నా జనం ఆమె ని పట్టించుకోకుండా ఉండడం వరంగల్ బస్టాండ్ లో జరిగింది.

వేణు ఉడుగుల దర్శకత్వంలో లో నటిస్తున్న సాయి పల్లవి ఆ మూవీలోని ఓ షాట్ కోసం సాధారణ లంగా వోణి వేసుకొని తలకి బాగా ఆయిల్ రాసి జడ వేసుకొని సాధారణ యువతి లా బస్ కోసం ఎదురుచూస్తున్న సాయి పల్లవి ని షూటింగ్ జరుగుతున్న విషయం ఎవరికీ తెలియకుండా బస్టాండ్ ఎదురుగా ఉన్న బిల్డింగ్ నుంచి షూట్ చేశారు. అలాంటి గెటప్లో ఉన్న కూడా సాయి పల్లవి ని ఓ వ్యక్తి గుర్తించి దూరం నుంచి తన ఫోన్లో చిత్రీకరించి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. షూటింగ్ ముగిసిన వెంటనే జనం తనని గుర్తించే లోపే అక్కడ రెడీ గా ఉన్నా ఓ బస్సు ఎక్కి వెళ్ళిపోయింది సాయి పల్లవి. ప్రస్తుతం సాయి పల్లవి రానా సరసన విరాట పర్వం లో నటిస్తుంది. రానా లేకుండానే తన సీన్స్ అన్ని పూర్తి చేసి ఈనెల రెండో వారంలో నాగచైతన్యతో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమా లో నటించడానికి సిద్ధమవుతోంది.