Sai Pallavi | ఉత్తమ నటిగా సాయిపల్లవి..

-

తమిళ చిత్ర పరిశ్రమ చాలా ప్రత్యేకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకగా ఘనంగా జరిగింది. ఇందులో పలువురు నటులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ క్రమంలోనే నేచురల్ బ్యూటీ సాయిపల్లవికి ఉత్తమ నటి అవార్డును అందించారు. అమరన్ సినిమాలో సాయి పల్లవి(Sai Pallavi) నటన అద్భుతంగా ఉందని పేర్కొంటూ ఆ సినిమాకు గానూ ఈ బ్యూటీకి అవార్డు అందించారు. తనకు అవార్డు రావడంపై సాయిపల్లవి సంతోషం వ్యక్తం చేశారు.

- Advertisement -

‘‘22వ చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటిగా అవార్డు అందుకోండం నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. ఈ ఏడాది ఎన్నో గొప్ప చిత్రలు విడుదలయ్ాయయి. ఎంతో పోటీ ఉంది. అలాంటి సమయంలో ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేయడం చాలా స్పెషల్‌గా ఉంది. ఇందుకు నా అభిమానులే కారణం. వారు చూపిన ప్రేమ నన్నెంతో భావోద్వేగానికి గురి చేసింది.

ముకుంద్ కుటుంబీకులు, సతీమణి వల్లే ఆ పాత్రను అంతలా పండించగలిగాను. ఈ కథను ప్రపంచడానికి చెప్పడానికి వాళ్లు ఓకే చెప్పడం వల్లే ఈ సినిమాను రూపొందించగలిగాం. దేశం కోసం నిరంతరంశ్రమిస్తున్న ఒక జవాను కథ ఇది’’ అని సాయి పల్లవి(Sai Pallavi) చెప్పుకొచ్చింది.

విజేతలు వీరే..

ఉత్తమ చిత్రం: అమరన్
రెండో ఉత్తమ చిత్రం: లబ్బర్ పందు
ఉత్తమ నటుడు : విజయ్ సేతుపతి (మహారాజ)
ఉత్తమ నటి: సాయిపల్లవి (అమరన్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సీహెచ్ సాయి (అమరన్)
ఉత్తమ ఎడిటర్: ఫిలోమిన్ రాజ్ (అమరన్)
ఉత్తమ బాలనటుడు: పొన్వెల్ (వాళై)
ఉత్తమ సహాయనటుడు: దినేశ్ (లబ్బర్ పందు)
ఉత్తమ సహాయనటి: దుషారా విజయన్ (వేట్టయన్)
ఉత్తమ రచయిత: నిథిలన్ సామినాథన్ (మహారాజ)
ఉత్తమ సంగీత దర్శకుడు: జీవీ ప్రకాశ్ (అమరన్)
స్పెషల్ జ్యూరీ అవార్డు : మారి సెల్వరాజ్ (వాళై), పా.రంజిత్ (తంగలాన్)

Read Also: హైబీపీ రాకూడదంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...