థియేటర్లకు వస్తున్న ‘శైలజా రెడ్డి అల్లుడు

థియేటర్లకు వస్తున్న 'శైలజా రెడ్డి అల్లుడు

0
156

ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథలతో వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న డైరెక్టర్ మారుతీ తాజాగా నాగచైతన్య కథానాయకుడిగా ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా రూపొందిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే చాలావరకు పూర్తయ్యింది.దాదాపు విడుదల తేదీ ఖరారైపోయినట్టేనని అంటున్నారు.ఈ సినిమాను ఆగస్టు 31వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తుండగా మరో ముఖ్యమైన పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారు . పొగరుబోతు భార్య .. ఆమెను వెనకేసుకొచ్చే అత్తగారు .. ఆ ఇద్దరినీ దారికి తెచ్చే అల్లుడు నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుంది. గతంలో ఈ తరహా సినిమాలు చాలానే వచ్చినప్పటికీ .. ఈ కథలో వెరైటీ ట్విస్ట్ ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో తమన్నా .. చైతూలపై చిత్రీకరించనున్న ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయతు’ సాంగ్ రీమిక్స్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.