తెలుగులోకి సాయిపల్లవి మలయాళ మూవీ

తెలుగులోకి సాయిపల్లవి మలయాళ మూవీ

0
93

తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో సాయిపల్లవికి ఎంతో క్రేజ్ వుంది. తెలుగులో ఆమె శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా చేయనుంది. త్వరలోనే ఆమె ఒక అనువాద చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించనుంది. మలయాళంలో ఆమె చేసిన ‘అథిరన్’ సినిమా ఈ ఏడాది ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

వివేక్ దర్శకత్వం వహించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ అక్కడ భారీ విజయాన్ని సాధించింది. ఆమె జోడీగా ఫహద్ ఫాజిల్ నటించిన ఈ సినిమాను, జయంత్ ఆర్ట్స్ బ్యానర్ వారు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగులో ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేసి, విడుదల తేదీని ప్రకటించనున్నారు. తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.