సైరా పై బన్నీ ఇలా అన్నాడేంటి..!!

సైరా పై బన్నీ ఇలా అన్నాడేంటి..!!

0
100

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమా రిలీజ్ కి అంతా సిద్ధమైంది.. అక్టోబర్ 2 న ఈ సినిమా రిలీజ్ కి దేశమంతా ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి.. అయితే ఈ సినిమా అందరు హీరో లు ఏదోరకంగా తమ ప్రేమను వెళ్లబుచ్చారు.. మెగా హీరోలనే కాదు ఇతర సినిమా హీరోలు కూడా సైరా పై ఏదోరకంగా కామెంట్స్ చేశారు.. అయితే బన్నీ ఈ సినిమా పై నోరు విప్పకపోవడంతో మెగా ఫాన్స్ అల్లు అర్జున్ పై కాస్త కోపంగా ఉన్నారు..

అయితే ఆయన తాజాగా చేసిన కామెంట్స్ వారి కోపాన్ని కాస్త తగ్గించాయని చెప్పొచ్చు.. సోషల్ మీడియా అకౌంట్‌లో సైరా గురించి ఒక సుదీర్ఘమయిన పోస్ట్ పెట్టాడు బన్నీ.’ సైరా నరసింహారెడ్డి..మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఒక మాగ్నమ్ ఓపస్ ఇది. ఇది నిజంగా తెలుగు సినిమా గర్వించదగ్గ విషయం. చాలా సంవత్సరాల క్రితం నేను మగధీర సినిమా చూసినప్పుడు ఎప్పుడోఅప్పడు చిరంజీవిగారిని కూడా అలాంటి ఒక గ్రాండ్ ఎపిక్ సినిమాలో చూడాలి అనుకున్నాను. ఆ ఆశ ఇప్పుడు నెరవేరింది. చిరంజీవి గారితో ఇలాంటి ఎపిక్ సినిమా తీసినందుకు ఈ సినిమా ప్రొడ్యూసర్ మరియు నా సోదరుడు అయిన రామ్ చరణ్‌కి థాంక్స్ చెబుతూ అభినందిస్తున్నాను. ఒక తండ్రికి ఒక కొడుకు ఇవ్వగలిగిన బెస్ట్ గిఫ్ట్ ఇదే. కన్న తండ్రి ఘనవారసత్వానికి అసలయిన నివాళి.అన్నారు..