బిగ్ బాస్ హిందీలో సల్మాన్ కు మరింత పెరిగిన రెమ్యునరేషన్

బిగ్ బాస్ హిందీలో సల్మాన్ కు మరింత పెరిగిన రెమ్యునరేషన్

0
131

బిగ్ బాస్ హిందీలో ఎంత సక్సస్ అయిందో తెలిసిందే.. ఇక హోస్ట్ గా సల్మాన్ వ్యవహరించే తీరు ఆ షోకు మరింత అందం తెచ్చింది.. టీర్పీలో దేశంలో మొదటి స్ధానంలో అదే ఉంది. గత కొన్నేళ్లుగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ హోస్ట్ గా కొనసాగుతూ ఉన్నారు. ప్రస్తుతం పదమూడో సీజన్ నడుస్తూ ఉంది. ఈ సారి బిగ్ బాస్ హౌస్ ఎపిసోడ్లను పెంచాలని నిర్వాహకులు భావిస్తున్నారట. అయితే సల్మాన్ అందుకు మొదట ససేమేరా అన్నట్టుగా తెలుస్తోంది.

ఆయన కొత్త సినిమా షూటింగ్ ఉండటం వల్ల ఆయన చేయను అని చెప్పారట ..కాని రిక్వెస్ట్ చేసి ఆయనని ఒప్పించడం వల్ల ఆయన తర్వాత కూల్ అయి 10 ఎపిసోడ్లకు ఒప్పుకున్నారు.. ఈ పది ఎపిసోడ్లకు సుమారు 5 కోట్ల రూపాయలు ఆయనకు రెమ్యునరేషన్ ఇస్తున్నారట.. ఇది బీటౌన్ నుంచి సోషల్ మీడియాలో సల్మాన్ అభిమానుల వరకూ తెలిసిపోయింది..

దీనిని గొప్పగా షేర్ చేస్తున్నారు అభిమానులు… మరి నిజమే సల్మాన్ రేంజ్ అలాంటిది , అయితే అక్కడ మాత్రమే ఈ రెమ్యునరేషన్ , ఇక్కడ తెలుగు, కన్నడ, తమిళ, బిగ్ బాస్ లో అంత పారితోషికాలు లేవు అనే చెప్పాలి.