కేమియో పాత్రలపై మనసు పారేసుకున్న బాలీవుడ్ స్టార్

-

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) తెలియని వారుండరు. మాస్, లవర్ బాయ్‌గా కూడా సల్మాన్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే కొత్తగా సల్మాన్.. కేమియో పాత్రలపై మనసు పారేసుకున్నారని బీటౌన్‌లో వినిపిస్తున్న మాట. ఒకదాని తర్వాత ఒకటిగా వరుసగా సల్మాన్ అతిథి పాత్రలు చేస్తుండటమే ఇందుకు కారణం. ఇప్పుడు కూడా తాజాగా మరో కేమియో పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట ఈ స్టార్. ఇప్పటికే సల్మాన్.. వరుణ్ ధావన్ లేటెస్ట్ మూవీ ‘బేబీ జాన్’లో అతిథి పాత్రలో కనిపించనున్నారు. కనిపించేది ఐదు నిమిషాలే అయినా సల్మాన్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ కానున్నారన్న టాక్ కూడా జోరుగా సాగుతోంది. ఇంతలోనే మరో సినిమాలో గెస్ట్ రోల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.

- Advertisement -

అదే అజయ్ దేవగన్(Ajay Devgn) తాజాగా నటిస్తున్న ‘సింగమ్ ఎగైన్’ సినిమా. ఇప్పటికే ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా నటించనున్నాడంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంతలో సల్మాన్ పేరు కూడా రావడంతో ‘సింగమ్ ఎగైన్’ నిజంగానే పవర్ ప్యాక్‌డ్‌గా రూపొందుతోందని అర్థమవుతోంది. ఇటీవలే హృతిక్ రోషన్, ఎన్‌టీఆర్‌ lలు హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ ‘వార్ 2’లో కూడా సల్మాన్(Salman Khan) మెరవనున్నాడట. ఇందులో భాగంగానే మరో రెండు సినిమాల్లో కూడా అతిథి పాత్ర చేయడానికి సల్మాన్ ఆసక్తిగా ఉన్నట్లు కూడా వినిపిస్తోంది. కాగా ఒక్కసారిగా మెయిన్ పాత్రలను వదిలి సల్మాన్ అతిథి పాత్రలపై ఫోకస్ ఎందుకు పెట్టారో మాత్రం తెలియట్లేదు. అత్వరలో దీనిపై సల్మానే ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Read Also: అతిగా ఆలోచిస్తున్నారా.. ఇక అంతే సంగతులు!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...