పవన్ కళ్యాణ్ సినిమాలో సల్మాన్ ఖాన్? గెస్ట్ రోల్ లో విక్టరీ వెంకటేష్..ఏ సినిమానో తెలుసా?

0
116

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటించిన పలు సినిమాలు ఇండస్ట్రీ హిట్ లుగా నిలిచాయి. దక్షిణాది సినిమాలను హిందీలో రీమేక్ చేశారు సల్లు బాయ్. ఇక చిరు గాడ్ ఫాదర్ లోను సల్మాన్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారు.

ఇక సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజాగా చిత్రం కిసీ కా భాయ్ కిసి కా జాన్. ఈ సినిమాలో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహేగ్దే హీరోయిన్ గా నటించనుంది. అలాగే కీలక పాత్రలో విక్టరీ వెంకటేష్ సందడి చేయబోతున్నారు. అయితే ఇప్పుడు సల్మాన్ నటిస్తున్న కిసీ కా భాయ్ కిసి కా జాన్ చిత్రానికి సంబంధించి ఓ వార్త హల్ చల్ చేస్తుంది.

ఈ సినిమా పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడుకు సీక్వెల్ గా తెరకెక్కనున్నట్టు సమాచారం. కాగా వీరమ్ ను తెలుగులో కాటమరాయుడిగా తెరకెక్కించగా కథలో మార్పులు చేసి హిందీలో తెరకెక్కిస్తున్నారని టాక్. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లిమ్ప్స్ ఆకట్టుకుంది. ఇందులో సల్మాన్ లుక్స్ అభిమానులకే ఈలలు వేయిస్తుంది.