బాలీవుడ్ లో కండల హీరో సల్మాన్ ఖాన్ కత్రిన అనుబంధం ఎలాంటింది ఈ ప్రశ్నకు ప్రత్యేకించి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు..సల్మాన్ ఖాన్ కత్రిన ప్రేమాయణం తర్వాత బ్రేకప్ తెలిసిందే..
కుర్రకారు రణబీర్ కపూర్ తో నిండా ప్రేమలో మునిగిన కత్రినకు ఊహించని ఝలక్ తగిలింది. రణబీర్ తో బ్రేకప్ తర్వాత తిరిగి సల్మాన్ ఖాన్ చెంతకు చేరింది ఈ ముద్దుగుమ్మ. వరుసగా సల్మాన్ నటిస్తున్న చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తూ ఫుల్ బీజి అయింది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా ఓ కార్యక్రమంలో సల్మాన్ తన ప్రత్యేక బంధాన్ని ఓపెన్ చేసింది. అందరు అనుకుంటున్నట్లు వెండితెర పై మా అనుబంధం వేరు తెర వెనుక మా అనుబంధం వేరు అని తెలిపింది.
కెరియర్ పరంగా తాను ఎంతో ఇబ్బందిపడుతున్న సమయంలో సల్మాన్ ఖాన్ తనకు ఎంతో సహాయం చేశారని తెలిపింది. పది మందికి సహాయపడే తత్వం ఆయకు ఉందని తెలిపింది. అయితే సల్మాన్ ఖాన్ తో ప్రేమ ఉందా అనేది విషయాన్ని దాటవేసింది ఈ మద్దుగుమ్మ.