మన చిత్ర సీమలో చాలా మంది హీరోలు హీరోయిన్లు వివాహాలు చేసుకోకుండా ఉన్న విషయం తెలిసిందే, అయితే పెళ్లి మాట ఎత్తితే మీడియా ముందు సమాధానం ఇవ్వకుండా ఆ ప్రశ్న దాటవేస్తారు, వారిలో బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ కూడా ఒకరు. 50 ఏళ్లు దాటినా ఆయన ఇంకా వివాహం చేసుకోలేదు. ఇలా ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ల మీద పెళ్లి వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.
అయితే సల్మాన్ వివాహం చేసుకోకపోయినా చాలా మంది గల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని అంటారు, మరి ఆయన ప్రేమలో మునిగితేలిన అందాల తారలు ఎవరు అనేది చూస్తే…సల్మాన్ ఖాన్ వయసు 54 సంవత్సరాలు ..మొదట ఐశ్యర్య రాయ్ని ప్రేమించాడు కానీ బ్రేకప్ అయ్యింది.
తర్వాత మళ్లీ కొద్ది రోజులు సంగీతను ప్రేమించట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కత్రినా కైఫ్తో మరోసారి ప్రేమలో పడ్డాడు.. దాంతో కొద్ది రోజుల పాటు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉన్నాడు భాయిజాన్.
అయితే మళ్లీ కండల వీరుడు ప్రేమలో పడ్డాడు, రొమేనియన్ మోడల్ లూలియా వంతూర్తో ప్రేమలో పడ్డాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ఆమెని వివాహం చేసుకుంటాడా లేదా అనేది అభిమానులు ఎదురుచూస్తున్నారు.