సల్మాన్ ఖాన్, నుంచి నేను అదే నేర్చుకున్నా – చరణ్

సల్మాన్ ఖాన్, నుంచి నేను అదే నేర్చుకున్నా - చరణ్

0
85

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 లో నటించిన విషయం తెలిసిందే. ప్రభుదేవా దర్శకుడుగా. సల్మాన్ఖాన్ ఫిలింస్, అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్, సఫ్రాన్ బ్రాడ్కాస్ట్ మీడియా లిమిటెడ్ పతాకాలపై సల్మాన్ఖాన్, అర్బాజ్ఖాన్, నిఖిల్ ద్వివేది నిర్మించారు, ఈ సినిమా కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

ఈ ఏడాది సల్మాన్ బాయ్ సినిమా దబాంద్ వస్తుంది అని అనుకున్నారు.. అలాగే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
డిసెంబర్ 20న సినిమా విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే . ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు విక్టరీ వెంకటేశ్ , మెగాపవర్స్టార్ రామ్చరణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక సల్మాన్ కు చరణ్, అలాగే వెంకటేష్ మంచి మిత్రులు అనేది తెలిసిందే. ఇక్కడ ఏ ఫంక్షన్ అయినా సల్మాన్ ని పిలుస్తారు, అలాగే సల్మాన్ అక్కడ ఫంక్షన్లకు కూడా పిలుస్తారు.

సల్మాన్గారంటే నాకెంతో ప్రేమ. సల్మాన్గారు, చిరంజీవిగారు, సుదీప్గారు, వెంకటేష్గారు .. వీరందరి నుండి ఓ విషయం నేర్చుకున్నాను. అదే క్రమశిక్షణ. మా తరం హీరోలు వారి నుండి నేర్చుకున్నదిదే అంటూ చరణ్ వారిని ప్రశంసించారు. ప్రభుదేవాగారికి అభినందనలు… ఈ సినిమా ఘన విజయం అవుతుంది అని తెలియచేశారు ఆయన… మొత్తానికి దబాంగ్ 3 మరికొన్ని గంటల్లో రికార్డులు నమోదు చేయనుందంటున్నారు అభిమానులు.