డేటింగ్ లో సల్మాన్ ఖాన్, సమంత?..ఖండించిన అమెరికా నటి

Salman Khan, Samantha in dating? .. Condemned American actress

0
110

సెలబ్రిటీలకు సంబంధించి ఎప్పుడూ ఎవో పుకార్లు పుడుతూనే ఉంటాయి. వాళ్లు డేటింగ్ లో ఉన్నారు. వీళ్లు విడిపోబోతున్నారంటూ వార్తలు నెట్టింట వైరల్ గా మారుతుంటాయి. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, అమెరికా నటి సమంత లాక్ వుడ్ తో డేటింగ్ లో ఉన్నాడంటూ ఇటీవల వార్తలు వచ్చాయి.

పాన్వెల్ లోని వ్యవసాయ క్షేత్రంలో ఇటీవల జరిగిన సల్మాన్ జన్మదిన వేడుకల్లోనూ ఆమె పాల్గొనడం ఈ ఊహాగానాలను మరింత ఆజ్యం పోసినట్లు అయింది. దీనిపై మీడియా ప్రతినిధులు నేరుగా ’షూట్ ది మూవీ‘ చిత్ర కథానాయిక అయిన సమంతనే అడిగేశారు.

‘‘ప్రజలు చాలా మాట్లాడుతుంటారు. లేని దాని గురించి చాలానే చెప్పగలరు. నేను సల్మాన్ ఖాన్ ను కలుసుకున్నాను. ఆయన మంచి వ్యక్తి. చెప్పడానికి ఇంతకు మించి ఏమీ లేదు. ప్రజలకు ఈ ఆలోచన ఎలా వచ్చిందో నాకు తెలియదు. నేను కలవడం అంటే.. హృతిక్ రోషన్ ను కూడా కలుసుకున్నాను. కానీ, నా గురించి, హృతిక్ గురించి ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ఈ వార్తలు ఎక్కడ నుంచి వచ్చాయో తెలియడం లేదు’’ అని స్పష్టం చేసింది.