బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan).. హైదరాబాద్‌కు విచ్చేస్తున్నారు. తన తాజాగా సినిమా ‘సికిందర్’ సినిమా షూటింగ్ కోసం ఆయన హైదరాబాద్‌కు వస్తున్నారు. కాగా ఇటీవల సల్మాన్‌కు వరుస బెదిరింపులు వస్తున్న క్రమంలో హైదరాబాద్‌లో ఆయనకు భారీ భద్రత కల్పిస్తున్నారు అధికారులు. ఈ క్రమంలోనే సల్మాన్ సినిమా ‘సికిందర్(Sikandar)’ షూటింగ్‌ను మేకర్స్ సిటీలో రాయల్ హోటల్‌గా పేరొందిన ఉన్న ఫలక్‌నుమా ఫ్యాలెస్‌లో కూడా జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఆ హోటల్లో భద్రతను నాలుగంచెలు పెంచారు అధికారులు. ఎటువంటి అనివార్య ఘటనలు జరగకుండా చూసుకోవడం కోసం భారీ సంఖ్యలో పోలీసులు ఫూటింగ్ స్పాట్‌కు చేరుకోనున్నారు. సల్మాన్‌కు కల్పించే భద్రత విషయంలో రాజీకి స్థానం లేదని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. అందుకోసమే 50 మంది నుంచి 70 మంది వరకు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని కూడా అరేంజ్ చేశారు.
ఫలక్‌నూమా ప్యాలెస్(Falaknuma Palace)ను ఈ షూటింగ్ రోజుల్లో బుక్ చేసుకున్న అతిథులు వచ్చినా సరే వారినీ చెక్ చేయాల్సి ఉంటుందని నిర్మాతలు నిశ్చయించుకున్నారు. ఎవరు వచ్చినా చెకింగ్ లేకుండా లోపలికి అనుమతించకూడదని డిసైడ్ అయ్యారు. దానికి తగ్గట్టుగానే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు హోటల్ సిబ్బందికి కూడా పలు నిబంధనలు పెట్టారు. ఐడీ కార్డులు ఉంటేనే లోపలికి ఎంట్రీ ఇవ్వాలని, సిబ్బంది ఐడీలను ప్రతి రోజూ తనిఖీ చేస్తామని సెక్యూరిటీ సిబ్బంది తెలిపింది. అయితే హైదరాబాద్‌లో షూటింగ్ ముగిసిన తర్వాత సల్మాన్(Salman Khan).. దుబాయ్‌కి వెళ్లనున్నారు.