రష్మిక మందన(Rashmika).. పుష్ప-2తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందీ ముద్దుగుమ్మ. ఈ సినిమా కోసం దాదాపు నాలుగేళ్లు కష్టపడిన రష్మిక.. బాలీవుడ్‌లో కూడా వరుస ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో కుబేర, సికిందర్, చావ, ద గర్లఫ్రెండ్, థామ సినిమాలు ఉన్నాయి. సికిందర్ సినిమాలోరష్మిక.. సల్మాన్ ఖాన్ సరసన నటిస్తోంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. సల్మాన్(Salman Khan)తో కలిసి నటించడం చాలా గొప్ప విషయమని, ఆయన చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పుకొచ్చింది. షూటింగ్‌లో చాలా హుందాగా ఉంటాడని, కోస్టార్స్ పట్ల చాలా కన్సర్న్ చూపుతాడని చెప్పుకొచ్చింది.
‘‘ఒకానొక సమయంలో నాకు ఆరోగ్యం బాగాలేదు. నా పరిస్థితి తెలుసుకున్న సల్మాన్.. ఎలా ఉంది? అంతా ఓకేనా? ఏమనా హెల్ప్ కావాలా? అని ఆరా తీశారు. మంచి హెల్తీ ఫుడ్, వేడి నీళ్లు అరేంజ్ చేయమని అక్కడి వాళ్లకు చెప్పారు. నన్ను చాలా బాగా చూసుకున్నాడు. చాలా స్పెషల్ కేర్ చూపించాడు. దేశంలోని పెద్ద స్టార్స్‌లో ఒకరైనా.. చాలా అణుకువుగా ఉంటారు. అంతా పెద్ద స్టార్ లా ఉంటారని ఊహించలేం. కానీ సల్మాన్ తన సహనటుల పట్ల చాలా కేర్ చూపిస్తారు’’ అని Rashmika చెప్పింది.