స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు.. కండల వీరుడి సినిమాలు వచ్చాయి అంటే బీ టౌన్ లో రికార్డులు క్రియేట్ అవుతాయి… ఆదాయ పన్ను శాఖకు పెద్ద మొత్తంలో పన్ను కడుతున్న హీరోల్లో ఆయన ఫస్ట్ ఉంటారు… అయితే సల్మాన్ మొదటి జీతం ఎంతో తెలిస్తే అవాక్కవుతారు.
సల్మాన్ 1989లో బివీ హోతో ఆసి చిత్రంతో వెండితెరపై ప్రవేశించారు…తర్వాత మైనే ప్యార్ కియా చిత్రం ఆయనకు మంచి హిట్ గా వచ్చింది, ఇక తర్వాత మంచి కథలు ఎంచుకుని తక్కువ సమయంలోనే స్టార్ హీరో అయ్యారు, సల్మాన్ ఖాన్ సినిమాల్లోకి రావడానికి ముందు బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్గా పని చేశారు.
ముంబైలోని తాజ్ హోటల్లో జరిగిన ఓ కార్యక్రమంలో బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్గా మొదట్లో ఆయన పని చేసినందుకుగానూ అప్పట్లో మన కండల వీరుడు సల్మాన్ కి కేవలం 75 రూపాయలు ఇచ్చారట, అది అప్పట్లో చాలా ఎక్కువ.ఇదే తనకు అందిన మొదటి జీతం అంటారు, ఇక తర్వాత ఆయనకు హిట్ ఇచ్చిన చిత్రం మైనే ప్యార్ కియా ఈ చిత్రానికి రూ.31 వేలు రెమ్యునరేషన్ అందుకున్నారు.. ఇప్పుడు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ అందుకుంటున్నారు సల్మాన్ ఖాన్.