ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పై సల్మాన్ ట్వీట్- 1990 నాటి విష‌యం చెప్పిన స‌ల్మాన్

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పై సల్మాన్ ట్వీట్- 1990 నాటి విష‌యం చెప్పిన స‌ల్మాన్

0
118

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య ప‌రిస్దితి మ‌రింత విష‌మించింది, ఆయ‌న‌కు క‌రోనా రావ‌డంతో ఆయ‌న చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, అయితే క‌రోనా త‌గ్గి నెగిటీవ్ వ‌చ్చినా ఆయ‌న‌కు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా మ‌ళ్లీ ఫీవ‌ర్ రావ‌డంతో ప‌రిస్దితి సీరియ‌స్ అయింది.

ఈస‌మ‌యంలో ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాలి అని ఆయ‌న అభిమానులు అంద‌రూ కోరుకుంటున్నారు, బాలు తెలుగు వారు.. అయినా ఆయ‌న దేశ వ్యాప్తంగా పేరున్న సింగ‌ర్, 50 వేల పాట‌లు పాడిన గాయ‌కుడు, ప్ర‌పంచంలో ఈ రికార్డ్ ఎవ‌రి పేరుమీద లేదు, దేశంలో అన్నీ భాష‌ల్లో ఆయ‌న పాట‌లు పాడారు.

ఎంద‌రో యువ హీరోల‌కు ఆయ‌న గాత్రం అందించారు, ఆ సినిమాలు హిట్ అవ్వ‌డానికి బాలు కార‌ణం, ఇక బాలీవుడ్ ను ఏలుతున్న హీరోల‌కు కూడా కొన్ని వంద‌ల పాటలు పాడారు ఆయ‌న‌, తాజాగా అందులో స‌ల్మాన్ ఖాన్ కూడా ఒక‌రు, ఆయ‌న బాలు గురించి ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాలి అని కోరుకున్నారు.

సల్మాన్ ఖాన్ తాజాగా ట్వీట్ చేశారు.. 1990వ సంవత్సరంలో సల్మాన్ ఖాన్ చిత్రాల కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచాయి. ఆ పాట‌లు ఇప్ప‌టికీ అంద‌రూ వింటారు, మీరు నాకోసం పాడిన పాట‌లు మ‌ర్చిపోలేనివి.. ప్రతి పాటకి ధన్యవాదాలు సార్…మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అంటూ సల్మాన్ ట్వీట్ చేశారు.