మరో రికార్డు సాధించిన సామజవరాగమనా..!!

మరో రికార్డు సాధించిన సామజవరాగమనా..!!

0
93

అల్లు అర్జున్ హీరో గా తెరకెక్కుతున్న సినిమా అల.. వైకుంఠపురంలో.. త్రివిక్రమ్ దర్శకుడు.. పూజ హెగ్డే కథానాయిక గా నటిస్తున్న ఈ సినిమా కి థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.. ఇటీవలే సీడ్ శ్రీరామ్ ఆలపించిన పాట రిలీజ్ కాగా ఆ పాట యూట్యూబ్ ట్రేండింగ్ గా మారింది.

ఈ సాంగ్ రెండు రోజుల్లోనే కోటి వ్యూస్ తో సెన్సేషనల్ రికార్డ్ అందుకుంది. అంతేకాదు లైకుల్లో కూడా అత్యధికంగా 2,50,000ల లైకులు సాధించింది. ఇలానే కొనసాగితే సాంగ్స్ రికార్డుల్లో బన్నిని బీట్ చేసే స్టార్ ఉండడని చెప్పొచ్చు. 2020 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ మూవీ టీజర్ లో తండ్రి కొడుకుల సీన్ చూపించి ఈ సినిమా ఎలా ఉండబోతుందో క్లూ ఇచ్చాడు. మొత్తానికి అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సంక్రాంతికి క్రేజీ మూవీగా మారుతుందని చెప్పొచ్చు.