‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో కు గెస్ట్ గా సమంత..!

0
103

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. ఈ షోకు సమంత సెలెబ్రెటీ గెస్టుగా రానున్నట్లు లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవలే నాగ చైతన్యతో విడిపోతున్నట్టు అధికారకంగా ప్రకటించిన సమంత. ఆ మూడ్ లోనుండి బయటకు రావాలని షూటింగ్స్ లో పాల్గొంటుందట. ఇదే క్రమంలో ఎవరు మీలో కోటీశ్వరులులో ఆమె ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తైనట్టు తెలుస్తోంది.

మేనేజర్ మహేంద్రతో కలిసి ‘EMK’ కార్యక్రమంలో అందుకున్న చెక్‌తో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ షోలో సమంతకి తారక్ నుంచి ఎలాంటి ప్రశ్నలు ఎదురయ్యాయి..అమె ఎలాంటి సమధానాలను చెప్పింది..ఎంత అమౌంట్ గెలుచుకుంది.. అనేది తెలియాలంటే ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేవరకు ఎదురు చూడాల్సిందే. కాగా నాగచైతన్యతో విడిపోయిన తర్వాత మొదటిసారి స్క్రీన్ పై అప్పీయరెన్సు ఇచ్చే షో ఇదే కానుంది.

పైగా విడాకులకు సంబంధించి సమంత ఓ క్లారిటీకి వచ్చేసిన తర్వాత జరిగిన ఈ షో లో చైతు–సామ్  అనుబంధం గురించి ఎన్టీఆర్ ఏమైనా ప్రశ్నలు అడిగారో లేదో తెలియదు కానీ, ఈ షో టీఆర్పీ మాత్రం సూపర్ గా పెరిగే ఛాన్స్ ఉంది.