పవన్ కల్యాణ్ సినిమాలో హీరోయిన్ గా సమంత ? టాలీవుడ్ టాక్

Pawan Kalyan , Samantha Combination movie updates

0
116

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా సమంత ఎంతో పేరు సంపాదించున్నారు. అక్కినేని వారి కోడలు సమంత వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అందరు యువ హీరోలతో ఆమె సినిమాల్లో నటించారు. అయితే చైతూతో వివాహం అయిన తర్వాత ఆమె గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ వస్తోంది. నటన ప్రధానమైన పాత్రలు ఎక్కువగా చేస్తున్నారు.

ఇక ప్రస్తుతం ఆమె ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాను చేస్తోంది. ఈ సినిమాపై ఆమె ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇక కొంత మేర చిత్రీకరణ కూడా పూర్తి అయింది. అయితే టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఆమె మరోసారి పవన్ కల్యాణ్ కు జోడిగా నటించనున్నారట.

పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సమంత నటిస్తుందనే వార్త వినిపిస్తోంది. చూడాలి దీనిపై అఫీషియల్ ప్రకటన వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సామ్ అభిమానులు.