విడాకులపై సమంత క్లారిటీ ఇచ్చినట్టేనా?

Samantha clarity on divorce

0
101

టాలీవుడ్ లో మోస్ట్ లవ్ లి కపుల్స్ లో నాగచైతన్య, సమంత ముందు వరుసలో వుంటారు. అయితే స‌మంత పేరు గ‌త కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. చైతూతో విడాకులపై అనేక వార్త‌లు వ‌స్తున్నా కూడా ఏ మాత్రం స్పందించ‌కుండా సైలెంట్‌గా ఉండ‌డం వంటి విష‌యాలు స‌మంత పేరుని హెడ్ లైన్స్‌లో ఉండేలా చేసాయి.

చైతూతో విడిపోతున్నారని వార్తలొస్తున్న నేపథ్యంలో..ఓ నెటిజన్‌, మీరు ముంబయికి షిఫ్ట్ అవుతున్నారని వార్తలొస్తున్నాయి. ఇందులో నిజమెంతా అని ప్రశ్నించారు. దీనిపై సమంత స్పందించింది. ఈ రూమర్స్ ఎలా పుడుతుంటాయో అర్థం కావడం లేదు.

హైద‌రాబాద్ వ‌దిలి ఎక్క‌డికి వెళ్ల‌న‌ని చెప్పిన స‌మంత‌..ఈ పుకారు ఎక్క‌డ మొద‌లైందో తెలియ‌దు. అన్ని రూమ‌ర్స్‌లానే ఇది కూడా ఒక‌టి. హైదరాబాద్ నాకు అన్నీ ఇస్తోంది. నేను ఇక్కడే ఉంటాను” అని చెప్పుకొచ్చింది. దీనితో తనపై వస్తున్న రూమర్స్ కు పుల్ స్టాప్ పెట్టిందని ఫాన్స్ కూడా భావించారు. విడాకులకు సంబంధించి ఆమెని అనేక ప్రశ్నలు అభిమానులు ప్రశ్నించగా..వాటిని స్కిప్ చేస్తూ మ‌రింత స‌స్పెన్స్ పెంచింది.