ఎట్టకేలకు రూమర్స్ పై స్పందించిన సమంత..ఏమన్నదో తెలుసా?

Samantha finally responds to rumors..do you know what?

0
107

విడాకుల అనంతరం సామ్ తన దృష్టి మొత్తం కెరీక్ పై పెట్టేసింది. వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టేస్తుంది. కేవలం ప్రధాన పాత్రలకు మాత్రమే కాకుండా..స్పెషల్ సాంగ్స్‏లో స్టెప్పులేయడానికి కూడా రెడీ అయిపోయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేయబోతున్న సంగతి తెలిసిందే.

అలాగే ఇప్పటికే సామ్.. ఒకట్రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా.. గత కొద్ది రోజులుగా సామ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా నెట్టింట్లో టాక్. సమంత, బాలీవుడ్ ఎంట్రీపై ఎట్టకేలకు స్పందించింది.

సరైన స్క్రిప్ట్​ వస్తే నేను కచ్చితంగా బాలీవుడ్​లో సినిమా చేస్తాను. భాష నాకు ముఖ్యం కాదు. స్క్రిప్ట్ బాగుందా? ఈ పాత్రకు సరిపోతానా? ఈ సినిమాకు నేను న్యాయం చేయగలనా? ఈ ప్రశ్నలన్నీ నాకు నేనే వేసుకుంటానని సమంత చెప్పుకొచ్చింది. అయితే హీరోయిన్ తాప్సీ నిర్మాణంలో తెరకెక్కబోయే ఓ సినిమాతో సమంత బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇవ్వనుందని గట్టిగా పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.