మరో క్రేజీ ప్రాజెక్ట్ కు సమంత గ్రీన్ సిగ్నల్..ఈసారి ఆ పాత్రలో!

Samantha Green Signal for another crazy project..this time in that role!

0
107

స్టార్ హీరోయిన్ సమంత వరుస చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇప్పటికే పాన్ ఇండియా చిత్రాలకు ఒకే చెప్పిన ఆమె.. మరో ఆసక్తికర ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన రాజ్ డీకే ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న వెబ్ సిరీస్ లో స‌మంత గూఢ‌చారి పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ వెబ్ సిరీస్ గూఢ‌చ‌ర్యం సంబంధించిన క‌థాంశంతో తెర‌కెక్కుతుంద‌ని తెలుస్తుంది.

వరుణ్‌ ధావన్‌, సమంత తొలిసారి కలిసి నటిస్తుండగా.. ఇద్దరూ గూఢచారులుగా కనిపించనున్నారట. ఈ సిరీస్‌ సెట్స్‌పైకి వెళ్లే ముందు వరుణ్‌ ధావన్‌, సమంత ఇద్దరూ యాక్షన్‌ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వీరి పాత్రలు చాలా స్టైలిష్‌గా ఉంటాయని బాలీవుడ్‌ టాక్‌.

వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. భారతీయ ప్రేక్షకుల కోసం కొన్ని మార్పులతో ఆ సిరీస్‌ను వరుణ్‌, సమంతతో తెరకెక్కిస్తున్నారట. ఇటీవల ‘పుష్ప’లో ఐటమ్‌ సాంగ్‌లో అదరగొట్టిన సమంత.. ‘శాకుంతలం’, ‘యశోద’ చిత్రాలతో పాటు, ‘ది అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’ అనే అంతర్జాతీయ చిత్రంలోనూ నటిస్తున్నారు.