విజయ్ దేవరకొండ బోల్డ్ లుక్..సమంత హాట్ కామెంట్స్

0
103

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమాతో ఫుల్ బిజీగా వున్నాడు. ఈ సినిమాను డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తుండగా..అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తరువాత వీరి కాంబినేషన్ లోనే ‘జనగణమన’ సినిమా రాబోతుంది.

ఇది పూరి కలల ప్రాజెక్ట్ కావడం విశేషం. ‘లైగర్’ ఆగస్టు 25న విడుదలకానుంది. మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో రౌడీ హీరో బాక్సర్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది. దీంతో అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది టీమ్. అందులో భాగంగా లైగర్ టీమ్ ఓ పోస్టర్‌ను వదిలింది. ఆ పోస్టర్‌లో విజయ్ న్యూడ్‌గా దర్శనమిచ్చారు. గులాబీలను అడ్డు పెట్టుకుంటూ ఉన్న ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజాగా ఈ పోస్టర్ పై సమంత హాట్ కామెంట్స్ చేసింది.

విజయ్‌ కి రూల్స్‌ అన్నీ తెలుసు.. ఆ రూల్స్‌ బ్రేక్‌ కూడా చేయగలడు..అంతటి గట్స్‌ కేవలం విజయ్‌ కే ఉన్నాయి” అంటూ సమంత కామెంట్స్‌ చేసింది. అంతేకాదండోయ్‌… విజయ్‌ న్యూడ్‌ పిక్‌ ను తన ఇన్‌ స్టా గ్రామ్‌ లో స్టేటస్‌ పెట్టుకుంది.  కాగా.. సమంత, విజయ్‌ ఖుషీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.