Varun Dhawan | సమంతను చూస్తే భయమేసింది: వరుణ్ ధావన్

-

టాలీవుడ్ బ్యూటీ సమంత కష్టాలపై బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్(Varun Dhawan) కీలక వ్యాఖ్యలు చేశారు. సమంత కష్టాలతో పోల్చుకుంటే తన కష్టాలు చాలా చిన్నవన్నాడు. ‘సీటడెల్: హనీ బన్నీ’ షూటింగ్ సమయంలో వాటిని ప్రత్యక్షంగా చూశానని, వాటిని వర్ణించడం చాలా కష్టమని చెప్పుకొచ్చాడు. ఈ వెబ్‌సిరీస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్ మరిన్నీ కీలక విషయాలు పంచుకున్నాడు. ‘‘సమంతతో కలిసినప్పుడు టెన్షన్ పడేవాడిని. ఎందుకంటే ఒకరోజు షూటింగ్ జరుగుతుండగా సమంత కళ్లు మూసుకుని కూర్చుని ఇది మళ్ళీ అలాంటి రోజు అని చెప్పింది. అప్పటికే మేము రెండు గంటల నుంచి షూటింగ్ చేస్తున్నాం. అప్పుడు కాస్త బ్రేక్ ఇచ్చారు. వెంటనే అక్కడకు ఒక ఆక్సిజన్ సిలెండర్ వచ్చింది. అది సమంత కోసమే అని అర్థమైంది. ఆ సమయంలో సమంతను చూసి భయమేసింది’’ అని చెప్పాడు.

- Advertisement -

‘‘ఆరోగ్యం బాగోలేదని సెలవు తీసుకునే వెసులుబాటు ఉన్నా సమంతా(Samantha) అలా ఎప్పుడూ చేయలేదు. ఎప్పుడూ పనికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. మరోసారి సెర్బియాలోని ఓ రైల్వే స్టేషన్‌లో షూటింగ్ జరుగుతోంది. సమంత నా వెనక పరిగెత్తే సీన్ షూట్ చేస్తున్నాం. నేను పరిగెత్తుతున్నా.. సమంత కూడా నా వెనకే వేగంగా పరిగెడుతోంది. ఇంతలో ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలింది. నేను వెంటనే తనను పట్టుకుని ప్యాకప్ చెప్పాను. అప్పుడు కూడా చాలా భయమేసింది. కానీ రాజ్ అండ్ డీకే మాత్రం టెన్షన్ పడొద్దని అన్నారు. కొద్దిసేపటికే సమంత తిరిగి సాధారణ స్థితికి వచ్చింది. ఆ తర్వాత కూడా సమంత షూటింగ్‌లో పాల్గొంది. ఆమె నిజంగా ఒక ఇన్‌స్పిరేషన్’’ అని Varun Dhawan అన్నాడు.

Read Also: ‘పంత్ విషయంలో వారిదే తుది నిర్ణయం’
Follow us on: Google News, Twitter, ShareChat

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Traffic Volunteers | ట్రాన్స్‌జెండర్లకూ ఉపాధి అవకాశాలు.. ఎలా అంటే..

రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్లకు కూడా ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఈ మేరకు...

Nagarjuna | ‘ఇది చాలా గొప్ప క్షణం’.. చైతూ పెళ్ళిపై నాగార్జున సంతోషం

నాగచైతన్య(Naga Chaitanya), శోభిత(Sobhita)ల పెళ్ళిని ఇరు కుటుంబాలు అంబరాన్నంటేలా నిర్వహిస్తున్నారు. కుటుంబీకులు,...