సమంత ఐటం సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్

Samantha Item Song Full Video Release

0
83

ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ కాంబోలో వచ్చిన సినిమా ‘పుష్ప’. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను షేక్​ చేస్తోంది. బన్నీ నటనకు తోడు ఇక దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి అభిమానులు ఊగిపోతున్నారు. మరీ ముఖ్యంగా చిత్రంలోని పాటలు విపరీతంగా ఆకట్టుకొని మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్తున్నాయి.

ఈ సినిమాలో సమంత చేసిన ప్రత్యేక గీతం ‘ఊ అంటావా మామా’ హైలైట్​గా నిలుస్తోంది. ఈ పాటలో  బన్నీతో సమంత చేసిన స్టెప్పులు థియేటర్లలో అభిమానులతో ఈలలు వేయిస్తోంది. సమంత స్టెప్పులు, హావభావాలకు ఫ్యాన్స్​ పిచ్చెక్కిపోయారు. తాజాగా పుష్ప నుండి సమంత ఐటం సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ చేశారు.

శేషాచలం ఎర్రచందనం నేపథ్యంగా తీసిన ‘పుష్ప’ సినిమాలో అల్లుఅర్జున్, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించారు. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీమూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మించింది.

https://youtu.be/u_wB6byrl5k