ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత ఆ చిత్ర దర్శకుడు అజయ్ భూపతి ఏ సినిమా కూడా పట్టాలెక్కించలేదు, దీంతో అవకాశాలు బాగానే వస్తాయి అని అనుకున్న వారు కూడా షాక్ అయ్యారు, అయితే రెండు ప్రాజెక్టులు వచ్చినా అవి పట్టాలెక్కించలేదు ఈ దర్శకుడు.. చాలాకాలం నుంచి అజయ్ తను రాసుకున్న మహాసముద్రం స్క్రిప్టుని పట్టుకొని చాలా మంది హీరోల దగ్గరకు వెళ్లాడు. స్క్రిప్టు బాగుందని చెప్పిన వారంతా తరువాత హ్యాండిచ్చారు.
అయితే ఇది దర్శకులకు కామన్ అనే చెప్పాలి ఇప్పుడు జానుతో హిట్ కొట్టిన శర్వానంద్ కూడా ఈ సినిమా చేద్దాము అని అనుకున్నారు. ఇక రెండో సినిమాకి అజయ్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఈ సమయంలో హీరోయిన్ సమంత చిత్రం నుంచి డ్రాప్ అయింది అని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ప్రస్తుతం శర్వానంద్తో కలిసి నటించిన జాను చిత్ర ఫలితమే అని సమాచారం.
అయితే కాస్త గ్యాప్ ఇద్దాము అని శర్వాతో రెండోసారి వరుసగా ఎందుకు అని అనుకుందని మరో వార్త వినిపిస్తోంది. ఈ సినిమా కోసం సమ్మోహనం ఫేం అదితి రావ్ హైదరీని తీసుకున్నట్లు తెలిసింది. చైతన్ భరద్వాజ సంగీతం అందిస్తున్నారు. వచ్చే నెల నుంచి సినిమాస్టార్ట్ అవనుందట.