సమంత షాకింగ్ కామెంట్స్..నేను జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నా అంటూ..

0
109

నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఆమె సోషల్‌ మీడియాలో పెట్టే ప్రతి పోస్ట్‌ వైరల్‌ అవుతుంది. పోస్టుల ద్వారా సామ్‌ ఎక్కువగా మోటివేషనల్‌ కొటేషన్స్‌ షేర్‌ చేస్తుంది. అలాగే అవకాశం వచ్చినప్పుడల్లా ప్రేరణాత్మక ప్రసంగాలను ఇస్తుంది.

తాజాగా సామ్‌ మరోసారి తనకు సంబంధించిన సంచలన విషయాలను వెల్లడించింది.  ఇటీవల ఆమె రోష్ని ట్రస్ట్‌ ఏర్పాటు చేసిన సైకియాట్రి ఎట్‌ యువర్‌ డోర్‌ స్టెప్‌ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా సామ్‌ మాట్లాడుతూ.. ‘నేను జీవితంలో చాలా మానసిక సమస్యలు ఎదుర్కొన్నా. అలాంటి సమయంలో నా స్నేహితులు, వైద్యుల సహాయం తీసుకున్నా.

నేను ఈరోజు ధైర్యంగా నిలబడటానికి.. జీవితంలో ముందుకు వెళ్లడానికి నా స్నేహితులు, కుటుంబం, కౌన్సిలర్ల సహయమే కారణం. శరీరానికి దెబ్బ తగిలితే వైద్యులను ఎలాగైతే కలుస్తామో అలాగే మనసుకు గాయం అయినప్పుడు కూడా వైద్యులను సంప్రదించాలి’ అని సమంత చెప్పుకొచ్చింది.