నాగ చైతన్య క్యారక్టర్‌ పై సమంత షాకింగ్‌ కామెంట్స్‌

0
97

చైతూతో విడాకుల అనంతరం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉంది సమంత.  పాన్‌ ఇండియా చిత్రం ‘యశోద’ చిత్రీకరణ దశలో ఉండగా అంతర్జాతీయ సినిమా ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’లోనూ ఆమె కీలకపాత్ర పోషిస్తోంది. గుణశేఖర్‌ దర్శకత్వంలో నటించిన ‘శాకుంతలం’ ఈ ఏడాది విడుదల కానుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య క్యారక్టర్‌ పై సమంత షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. తన వద్ద డబ్బులు లేని సమయంలోనూ తనకు చైతూ అండగా ఉన్నాడని చెప్పుకొచ్చింది సమంత. ” ఒకానొక సమయంలో.. నేను చైతన్యతో కలిసి షూటింగ్‌ చేసేటప్పుడు నా దగ్గర కనీసం అమ్మకు కాల్‌ చేసి మాట్లాడటానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు నా పరిస్థితిని అర్థం చేసుకున్న చైతన్య… వెంటనే నా దగ్గరకు తన ఫోన్‌ ఇచ్చి.. ఎంతసేపైనా మాట్లాడమని చెప్పాడు. చైతన్య ఫర్‌ ఫెక్ట్‌ జెంటి మ్యాన్‌.. ఫైనాన్షియల్‌ గా చైతు నన్ను ఆదుకున్నాడు” అని సమంత చెప్పింది.

ఇక సినిమాల విషయానికొస్తే చైతు లవ్ స్టోరీతో సాలిడ్ హిట్ కొట్టి థాంక్యూ మూవీని పూర్తి చేశారు. అలాగే ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. సమంత తొలిసారి ‘పుష్ప’ సినిమా కోసం ‘ఊ అంటావా మావ’ అంటూ ఐటెం సాంగ్ కు బన్నీతో కలిసి స్టెప్పులేశారు. సమంత వేసిన స్టెప్పులతో ఈ పాటకు మరింత క్రేజ్‌ వచ్చింది. అలాగే యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో వరుస సినిమాలకు సామ్ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.