‘పెళ్లి’పై సమంత​ ఆసక్తికర పోస్ట్‌..నెట్టింట్లో తెగ వైరల్

Samantha's interesting post on 'Pelli' .. Tribe viral on Netflix

0
106

అగ్ర కథానాయిక సమంత ‘పెళ్లి’పై ఓ ఆసక్తికర సందేశాన్ని షేర్‌ చేశారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే వాటిని తట్టుకుని నిలబడగలిగేలా ఆడపిల్లల్ని పెంచాలంటూ భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్‌ రాణి రాంపాల్‌ చేసిన పోస్ట్‌ని సామ్‌ షేర్‌ చేశారు.

మీ కుమార్తెను ఎవరు పెళ్లి చేసుకుంటారు? అని చింతించకుండా ఆమెను శక్తివంతంగా తీర్చిదిద్దండి. కుమార్తె పెళ్లి కోసం డబ్బు దాచిపెట్టడానికి బదులు ఆమె చదువుపై ఖర్చుపెట్టండి. ముఖ్యంగా పెళ్లికి ఆమెను సన్నద్ధం చేయడానికి బదులు..తన కాళ్లపై తాను నిలబడగలిగేలా చేయండి.

తనని తాను ప్రేమించుకోవడం, ఆత్మస్థైర్యంతో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే భయపడకుండా నిలబడగలిగేలా జీవించడం నేర్పించండి” అనే ఓ సందేశాన్ని రాణీ రాంపాల్‌ పోస్ట్‌ చేశారు. ఆ పోస్ట్‌ నచ్చడంతో సమంత దాన్ని ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట్లో తెగ చర్చనీయాంశంగా మారింది.

దశాబ్ద కాలం నాటి ప్రేమ, నాలుగేళ్ల వివాహబంధానికి స్వస్తి చెబుతున్నట్లు ఇటీవల సమంత-నాగచైతన్య ప్రకటించారు. పరస్పర అంగీకారంతోనే విడిపోవాలనుకుంటున్నట్లు వాళ్లు ప్రకటించారు. ఈ క్రమంలో సామ్‌ ‘అమ్మ చెప్పింది’ అంటూ తన అభిప్రాయాలను పలు సందేశాల రూపంలో తరచూ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తున్నారు.