బ్రేకింగ్- సమంత సంచలన నిర్ణయం..వారిపై కోర్టుకు..

Samantha's sensational decision .. Defamation suit against them

0
117

ఇటీవల నాగ చైతన్యతో హీరోయిన్ సమంత విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి కూడా సమంత పై విపరితమైన ట్రోల్స్ జరిగాయి. సమంత చైతూ విడిపోటానికి కారణాలు ఇవే అంటూ రకరకాలుగా కొన్ని యూట్యూబ్ చానెల్స్ వార్తలను పోస్ట్ చేశాయి. ఇక ఇదే విషయమై సమంత కోర్టుకు ఎక్కింది.

సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం వాటిల్లే విధంగా వార్తలు ప్రసారం చేసిన మూడు యూట్యూబ్ ఛానల్స్ పై కూకట్ పల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసింది. సుమన్ టివి, తెలుగు పాపులర్ టీవీ , టాప్ తెలుగు టీవీ తో పాటు వెంకట్రావు అనే అడ్వకేట్ పై పిటిషన్ దాఖలు చేసింది. మరికాసేపట్లో సమంత తరపున హైకోర్టు న్యాయవాది బాలాజీ వాదించనున్నారు.