సమంత సంచలన పోస్ట్..ఆ ఇద్దరి వల్లే బతికున్నా అంటూ..

Samantha's sensational post..Is alive because of those two ..

0
116
samantha fan

చైతూతో విడాకుల అనంతరం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉంది సమంత. అలాగే టైం ఉన్నప్పుడల్లా ఫ్రెండ్స్ తో విహారయాత్రలు, సాహసయాత్రలు చేస్తూ జీవితాన్ని గడుపుతుంది. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఉన్న సామ్‌.. స్కీయింగ్‌ చేస్తూ హాలీడే ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.

“గతంలో ఎప్పుడూ ఇది ట్రై చేయలేదు. స్కీయింగ్‌ సాహసోపేతమైనది. అనుకోకుండా ఏదైనా జరిగితే ప్రాణాలను కోల్పోయే ప్రమాదమూ ఉంది. అయినా సరే విజయవంతంగా పూర్తి చేసి ప్రాణాలతో ఉన్నానంటే దానికి స్కీయింగ్ ట్రైనర్స్‌ కేట్‌, టోనెస్కి వల్లే” అంటూ థ్యాంక్స్‌ చెప్పింది. ‘కమాన్‌ సామ్‌.. ఏదైనా స్కీయింగ్‌ పోటీల్లో పాల్గొని స్వర్ణ పతకం సాధించిరా’ అంటూ సింగర్‌ చిన్మయ్‌ కామెంట్‌ చేశారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. పాన్‌ ఇండియా చిత్రం ‘యశోద’ చిత్రీకరణ దశలో ఉండగా అంతర్జాతీయ సినిమా ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’లోనూ ఆమె కీలకపాత్ర పోషిస్తోంది. గుణశేఖర్‌ దర్శకత్వంలో నటించిన ‘శాకుంతలం’ ఈ ఏడాది విడుదల కానుంది. అలాగే యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో వరుస సినిమాలకు సామ్ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.