హిందీ, తెలుగుతో పాటు పలు సౌత్ ఇండియన్ భాషల్లో వరుస సినిమాలతో ఓ ఊపు ఊపేసింది నటి సమీరారెడ్డి, తెలుగులో కూడా అగ్రహీరోలతో ఆమె నటించింది.. ఎన్టీఆర్తో కలిసి నరసింహుడు, అశోక్ అదేవిధంగా చిరంజీవితో కలిసి జై చిరంజీవ చిత్రాలలో నటించింది, ఇక ఆమె వివాహం తర్వాత సినిమాలకు దూరంగానే ఉంది.
అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పలు సంచలన కామెంట్లు చేసింది..ఇండీస్ట్రీలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలు బయటపెడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.నటవారసులకు అవకాశాలివ్వడం కోసం తనను మూడు సినిమాల నుంచి తీసేశారని చెబుతూ ఓపెన్ అయింది.
అంతేకాదు తనకు ముందు స్టోరి చెప్పిన సమయంలో లిప్ లాక్ ఉంది అని చెప్పలేదు, కాని తర్వాత ఆ సీన్ చేయాలి అన్నారు.. నేను చేయను అని చెప్పాను..ఆ సీన్ చేయాల్సిందే లేదంటే సినిమా నుంచి తీసేస్తామని బెదిరించారని ఆమె తెలిపింది. ఇప్పటికీ సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనేది ఉందని, సమీరా రెడ్డి అన్నారు.