వరుస విజయాలతో టాలీవుడ్‌లో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ సంయుక్తా మీనన్(Samyuktha Menon) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పవన్ కల్యాణ్ భీమ్లానాయక్ నుంచి సాయితేజ్ విరూపాక్ష(Virupaksha) వరకూ వరుస హిట్లతో సత్తా చాటుతున్నారు. తాజాగా.. విరూపాక్ష బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే 70 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ వంద కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఇదిలా ఉంటే సంయుక్త మీనన్(Samyuktha Menon) తన గొప్ప మనసును చాటుకుంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ టీవీ రియాల్టీ షోకు వెళ్లిన ఆమె తాను గెల్చుకున్న స్కూటీని ఓ కాలేజీ అమ్మాయికి బహుమతిగా ఇచ్చింది. అలాగే మరొక అమ్మాయికి తానే స్కూటీ కొనిస్తానంటూ ముందుకొచ్చింది. బస్సుల్లో ట్రావెల్ చేస్తూ ఇబ్బందులు పడుతున్న ఈ ఇద్దరు అమ్మాయిలు సంయుక్త సాయంతో పట్టరాని ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సంయుక్త గొప్ప మనసును మెచ్చుకుంటున్నారు.