మహేష్ కాకపోతే ఇంకో హీరోతో అదే సినిమా – యంగ్ డైరెక్టర్

మహేష్ కాకపోతే ఇంకో హీరోతో అదే సినిమా - యంగ్ డైరెక్టర్

0
125

‘అర్జున్ రెడ్డి’ వంటి పాత్ బ్రేకింగ్ సినిమాతో తెలుగులో దర్శకుడిగా పరిచయమైన టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం అదే సినిమాను బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’ అనే పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి ఎలాంటి సినిమా చేయబోతున్నారు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం సందీప్ మరొక హిందీ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఓ మీడియా ఇంటర్వ్యూలో సందీప్ తన నెక్స్ట్ సినిమా గురించి స్పందించాడు. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో కథను సిద్ధం చేసుకుంటున్నానని పాన్ ఇండియా లెవెల్ లో దీన్ని తీయబోతున్నట్టు చెప్పాడు. కేజిఎఫ్ తరహాలో అందరికి కనెక్ట్ అయ్యే యునివర్సల్ అప్పీల్ అందులో ఉంటుందని చెబుతున్నాడు. దీని కన్నా ముందు మహేష్ బాబుకో పాయింట్ చెప్పి పాస్ చేయించుకున్న సందీప్ ఒకవేళ ఫుల్ స్క్రిప్ట్ తో మెప్పించగలిగితే ముందు అది లైన్ లో పెట్టేస్తాడు. కాని అది సరిలేరు నీకెవ్వరు షూటింగ్ తర్వాత మాత్రమే సాధ్యమవుతుంది. ఒకవేళ ప్రిన్స్ కు నచ్చకపోయినా సందీప్ పైన చెప్పిన క్రైమ్ సబ్జెక్టు తో వేరే హీరోతో ప్రొసీడ్ అవుతాడు. అని ఆ ఇంటర్వ్యూ లో చెప్పాడు..