ఆ పాత్రకు సంజయ్ ఒక్కరే సూట్ అవుతారు: రామ్

-

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) హీరోగా డబుల్ ఎనర్జీ.. డబుల్ మాస్.. డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో వస్తున్న సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. ఇందులో రామ్ ఎంత స్పెషల్‌గా కనిపించనున్నాడో సంజయ్ దత్ నటించిన ‘బిగ్ బుల్’ పాత్ర కూడా అందరినీ ఆకట్టుకుంది. మూవీలో బిగ్ బుల్‌గా సంజయ్ చూపిన యాక్టింగ్ ఔరా అనిపించింది. ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కానుండగా ముంబైలో ‘బిగ్ బుల్’ పాటను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా రామ్ ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పాడు. బిగ్ బుల్ పాత్రకు సంజయ్‌(Sanjay Dutt)నే ఎందుకు ఎన్నుకున్నారో కూడా చెప్పేశాడు.

- Advertisement -

‘‘ఈ సినిమా కోసం సంజయ్‌ని కలిసినప్పుడు ఆయన అప్పటికే ఏడు సినిమాలకు సంతకాలు చేసున్నారు. తన డేట్స్ దొరకవేమో అని అనుకున్నాం. కానీ.. అన్నీ అనుకున్నట్లు జరిగి సినిమాను పూర్తి చేశాం. బిగ్ బుల్ పాత్రకు సంజయ్ తప్ప మరెవరూ న్యాయం చేయలేరు. ఈ సినిమాలో మెంటల్ మ్యాడ్‌నెస్‌గా కనిపిస్తూ నా పాత్ర ఎంతలా ఆకట్టుకుంటుంది. సంజయ్ పోషించిన బిగ్ బుల్ పాత్ర కూడా అంతే హైలెట్‌గా ఉంటుంది. ఈ పాత్రకు సంజయ్ ఒక్కరే సూట్ అవుతారు. అందులో డౌట్ లేదు. సినిమా చూశాక మీరు కూడా ఇదే అంటారు’’ అని చెప్పాడు రామ్(Ram Pothineni).

Read Also: సినిమా చెట్టు బతికితే పెద్ద సినిమా తీస్తా.. డైరక్టర్ వంశీ
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తిరుపతి లడ్డూ తయారీ నెయ్యిలో పశువుల కొవ్వు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం(Tirumala Prasadam) తయారీలో పశువుల కొవ్వులు కలిపారని,...

‘వైసీపీలో ఏడ్చిన రోజులు ఉన్నాయి’.. పార్టీ మార్పుపై బాలినేని క్లారిటీ..

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy).. వైసీపీకి...