సంక్రాంతి పండుగ ఈసారి పూజాహెగ్డేకి వెరీ స్పెషల్ అంటున్న చిత్ర పరిశ్రమ

Sankranthi festival is very special for Pooja Hegde this time

0
111

టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా బ్యూటీ పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది. ఆమెకి వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ లో
ఒక లైలాకోసం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ. ఈమె చేసిన అన్నీ సినిమాలు హిట్ అవ్వడంతో పూజ లక్కీ బ్యూటీగా మారిపోయింది.

స్టార్ హీరోల సినిమా అంటే ముందు ఈ అమ్మడి వైపే చూస్తున్నారు దర్శక నిర్మాతలు.
ఇటు తెలుగు పరిశ్రమలోనే కాదు తమిళ, హిందీ చిత్ర పరిశ్రమలోనూ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా మారింది. 2022 సంక్రాంతికి ఆమె నటించిన చిత్రాలు రిలీజ్ కానున్నాయి. అందుకే ఆమెకు సంక్రాంతి వెరీ స్పెష‌ల్ అంటున్నారు టాలీవుడ్ చిత్ర అన‌లిస్టులు.

రాధేశ్యామ్ 2022 పొంగల్ కి విడుదల కానుంది.
బీస్ట్ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉంది.
ఆచార్య సినిమాలో చరణ్ కు జోడిగా నటిస్తుంది పూజా. ఇది కూడా సంక్రాంతికి విడుదల అవ్వచ్చు అని టాక్.