సంక్రాంతికి సినిమాలే సినిమాలు..రిలీజ్ డేట్లు ఫిక్స్!

Sankranthi movies are movies..which movies are being released?

0
138

టాలీవుడ్ కు సంక్రాంతి బిగ్ సీజన్ అని చెప్పవచ్చు. ఇప్పటికే పండగ బరిలో నిలిచిన భీమ్లానాయక్, RRR వాయిదా పడిన సంగతి తెలిసిందే. రాధేశ్యామ్ కూడా వాయిదా అంటూ పుకార్లు నెట్టింట వైరల్ అయ్యాయి. ప్రతీసారిలా ఇప్పుడు కూడా సంక్రాంతికి వరుసపెట్టి సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. కాకపోతే వచ్చే వాటిలో ఎక్కువశాతం చిన్న చిత్రాలే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఈ సంక్రాంతికి ‘బంగార్రాజు’ వస్తుందని సోషల్ మీడియాలో గాసిప్స్ వచ్చినప్పుడు.. ‘ఆర్ఆర్ఆర్’, ‘భీమ్లా నాయక్’, ‘రాధేశ్యామ్’ సినిమాలను తట్టుకుని అది నిలబడగలదా అని అందరూ అనుకున్నారు. కానీ వివిధ కారణాలతో ‘ఆర్ఆర్ఆర్’, ‘భీమ్లా నాయక్’ వాయిదా పడ్డాయి. దీంతో ‘బంగార్రాజు’కు లైన్ క్లియర్ అయింది.

సంక్రాంతి రేసు నుంచి భారీ బడ్జెట్​ సినిమాలు తప్పుకొనేసరికి చిన్న సినిమాలకు రూట్ క్లియర్ అయింది. షూటింగ్​లు పూర్తి చేసుకున్న పలు చిన్న చిత్రాలు.. వెంట వెంటనే రిలీజ్​​ డేట్​లు కూడా ఇప్పటికే ప్రకటించాయి. వీటిలో ‘డీజే టిల్లు'(జనవరి 14), ‘హీరో'(జనవరి 15), ‘సూపర్​మచ్చి'(జనవరి 14) విడుదల తేదీలను ఖరారు చేయగా.. ‘రౌడీబాయ్స్’, ‘7 డేస్ 6 నైట్స్’ చిత్రాలు.. సంక్రాంతి రిలీజ్​ అని పోస్టర్లు రిలీజ్ చేశాయి. వీటితో పాటు తమిళ సినిమా ‘వాలిమై’ కూడా ఈ పండగకే థియేటర్లలోకి రానుంది.