సూపర్ మచ్చి’తో సంక్రాంతి బరిలోకి మెగాస్టార్ చిరంజీవి అల్లుడు

-

మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు కళ్యాణ్ దేవ్. ‘విజేత’ అనే మూవీతో పరిచయం అయిన అతడు.. మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపును అందుకున్నాడు. ఆరంగేట్రం చేసిన సినిమాతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఆ వెంటనే ‘సూపర్ మచ్చి’ అనే సినిమాలో నటించాడు. పులి వాసు తెరకెక్కించిన ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రిజ్వాన్ ఈ సినిమాను నిర్మించారు. ఇందులో రుచితా రామ్ హీరోయిన్‌గా నటించింది.

- Advertisement -

మెగా కాంపౌండ్‌కు చెందిన కళ్యాణ్ దేవ్.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవాలన్న పట్టుదలతో ‘సూపర్ మచ్చి’ కోసం ఎంతో శ్రమించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యంగ్ హీరో.. లుక్స్, ఫిజిక్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడట. అందుకే ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక, ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

‘సూపర్ మచ్చి’ మూవీ నుంచి ఇప్పటి వరకూ వచ్చిన పోస్టర్స్, టీజర్‌కు మెగా అభిమానుల నుంచే కాకుండా.. సామాన్య ప్రేక్షకుల నుంచి కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా మంచిగానే జరిగిందని తెలుస్తోంది. విడుదలకు సమయం దగ్గర పడడంతో ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించి.. ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు మరింత చేరువ చేయాలని యూనిట్ భావిస్తోంది.

కళ్యాణ్ దేవ్ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘సూపర్ మచ్చి’ మూవీలో రాజేంద్రప్రసాద్, నరేష్‌, ప్రగతి, అజ‌య్‌, పోసాని కృష్ణమురళి, మహేష్, షరీఫ్, సత్యలు కీలక పాత్రలు పోషించారు. ఇక, ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా శ్యామ్ కే నాయుడు, ఆర్ట్ డైరెక్టర్‌గా బ్రహ్మ కడలి, ఎడిటర్‌గా మార్తాండే కే వెంకటేష్ పని చేశారు. అలాగే, ఈ మూవీలోని సాంగ్స్‌కు కేకే లిరిక్స్ అందించారు.

కాస్ట్: కళ్యాణ్ దేవ్, రచిత రామ్, నరేష్ VK, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ మురళి, ప్రగతి, అజయ్, మహేష్, షరీఫ్, సత్య

క్రూ:

రైటర్ & డైరెక్టర్: పులి వాసు
ప్రొడ్యూసర్: రిజ్వాన్
బ్యానర్: రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్
కో -ప్రొడ్యూసర్ : ఖుషి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మనోజ్ మావెళ్ల
మ్యూజిక్: SS థమన్
సినిమాటోగ్రఫీ: శ్యామ్ K నాయుడు
ఎడిటర్: మార్తాండ్ K వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
లిరిక్స్: KK
PRO: వంశి-శేఖర్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...