ఇటీవల వకీల్ సాబ్ చిత్రం రిలీజ్ అయింది సూపర్ హిట్ అయింది.. వంద కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.. పవన్ కల్యాణ్ మూడున్నరేళ్ల తర్వాత చేసిన చిత్రం కావడంతో అభిమానులు చాలా ఆనందంలో ఉన్నారు.. ఈ కరోనా ఎఫెక్ట్ సినిమాపై చాలా ప్రభావం చూపించింది.. లేకపోతే సినిమాకి దాదాపు 180 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చేవి అంటున్నారు.
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా ప్రస్తుతం రెండు సినిమాలు రూపొందుతున్నాయి. ఒకటి సాగర్.కె చంద్ర దర్శకత్వంలో మరొకటి క్రిష్ డైరెక్షన్ లో హరిహరవీరమల్లు ఈ రెండు చిత్రాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అభిమానులు… అంతేకాదు ఈ ఏడాది ఏదైనా సినిమా వస్తుంది అని ఆ రెండిటి గురించి ఆలోచించారు.
అయితే ఈ కరోనా సమయంలో దాదాపు షూటింగులు ఆగిపోయాయి. ఇక ఈ సినిమా సంక్రాంతికి రానుంది అని తెలుస్తోంది. అయితే మరో 8 నెలల సమయం ఉంది కాబట్టి కచ్చితంగా సినిమాకు సమయం సరిపోతుంది అని భావిస్తున్నారట, కచ్చితంగా సంక్రాంతికి ఈ సినిమా ఎలాగైనా వస్తుంది అని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది..