వారితో కలిసి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ బర్త్ డే సెలబ్రేట్ చేసిన Sara Ali Khan (వీడియో)

-

Sara Ali Khan – Sushant Singh Rajaput: బాలీవుడ్ హీరో, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ నేటికీ ప్రేక్షకుల గుండెల్లో సజీవంగానే ఉన్నాడు. కాగా శనివారం ఆయన బర్త్ యానివర్సరీని పురష్కరించుకుని యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ ఓ ఎన్‌జీవో కి చెందిన పిల్లలతో కలిసి సెలబ్రేట్ చేసింది. అంతేకాదు కేక్ కట్ చేసిన వీడియోను నెట్టింట పోస్ట్ చేస్తూ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు సుశాంత్. ఇతరులను నవ్వించడమంటే నీకు ఎంత ఇష్టమో మాకు తెలుసు. నువ్వు మా అందరినీ చూస్తున్నపుడు, చంద్రుడు అమావాస్య చీకట్లను వీడుతున్నాడు. ఈ రోజు కూడా నిన్ను నవ్వించామని ఆశిస్తున్నా. ప్రకాశిస్తూనే ఉండు.. జై భోలేనాథ్’ అంటూ నమస్కారంతో కూడిన ఎమోజీని జతచేసింది. అలాగే ఈ రోజును ప్రత్యేకంగా నిలిపినందుకు సునిల్ అరోరాకు ధన్యవాదాలు తెలిపిన సారా.. తనలాంటి వ్యక్తులు ప్రపంచాన్ని మెరుగైన, సురక్షితమైన, మరింత సంతోషకరమైన ప్రదేశంగా మార్చుతూ ఆనందాన్ని పంచాలని కోరింది. ఇక సుశాంత్ 37వ పుట్టినరోజును పిల్లలతో కలిసి జరుపుకున్న సారాపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

- Advertisement -

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...