సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మరో సీన్ యాడ్ ఎప్పటి నుంచంటే

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మరో సీన్ యాడ్ ఎప్పటి నుంచంటే

0
102

సూపర్స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరులో ఈ శనివారం నుంచి కొత్త సన్నివేశాన్ని యాడ్ చేస్తున్నారు. అయితే ఇటీవల ఇలా సీన్స్ యాడ్ చేయడం అనేది సినిమాల్లో పెరిగిపోయింది.. చాలా సినిమాలు విడుదల అయిన తర్వాత కొన్ని సీన్స్ యాడ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి ఇప్పుడు ఈ చిత్రంలో కూడా ఇలా ఓ సీన్ యాడ్ చేస్తున్నారట.

సూపర్స్టార్ మహేష్బాబు, రావురమేష్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య వచ్చే ఒక మంచి హిలేరియస్ సన్నివేశాన్ని జనవరి 25 శనివారం మార్నింగ్ షో నుంచి అన్నిసెంటర్స్లలో యాడ్ చేస్తున్నాం అని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాము అని తెలిపారు దర్శకుడు అనిల్ రావిపూడి.

దీంతో మహేష్ ఫ్యాన్స్ మళ్లీ ఈ సీన్ కోసం చూసేందుకు దియేటర్స్ కు క్యూ కడతాము అంటున్నారు, అయితే ఇలాంటి సీన్స్ చిత్రం సమయంలో ఎడిటింగ్ నిడివి వల్ల యాడ్ చేయలేకపోతారు అని. తర్వాత కొని సీన్స్ కట్ చేయడం వల్ల నిడివి పెంచుకునే అవకాశం ఉంటుంది అంటున్నారు చిత్ర సభ్యులు.