సరిలేరు నీకెవ్వరు చిత్రం ఆ బ్యాగ్రౌండ్ కాదట

సరిలేరు నీకెవ్వరు చిత్రం ఆ బ్యాగ్రౌండ్ కాదట

0
98

వరుస విజయాలతో దూసుకుపోతున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి … తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో సరిలేరు నీకెవ్వరూ సినిమా ఈ నెల 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది.. చిత్ర ప్రమోషన్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి కొన్ని కీలక విషయాలు తెలియచేశారు.

ఆయన మాట్లాడుతూ దేశభక్తి ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ కథ,ప్రేక్షకులకు అలాగే ఫ్యాన్స్ కు కావాల్సినంత వినోదాన్ని ఇస్తుంది అని తెలియచేసారు… మూడు ప్రధాన పాత్రల చుట్టూ ఈ చిత్రం ఉన్నట్లు తెలుస్తోంది… మహేశ్ బాబు ..విజయశాంతి.. ప్రకాశ్ రాజ్ పాత్రల చుట్టు ఈ సినిమా ఎక్కువ భాగం లైన్ ఉంటుంది అంటున్నారు.

దేశ సరిహద్దులో సైనికులు ప్రాణాలను అర్పిస్తుంటే, సమాజంలోని వారు బాధ్యత లేకుండా వుంటారా అని ప్రశ్నించే చిత్రం ఇది అని చెప్పవచ్చు… మహేష్ బాబు ట్రైలర్ లో కూడా దీనిని బాగా హైప్ చేశారు… ఈ చిత్రం లో ఎలాంటి ఫ్యాక్షనిజం లేదనే చెప్పుకోవాలి.. అభిమానులను ఆకర్షించే విధంగా ఈ చిత్రం ఉంటుందని తెలియచేసారు.. సో మొత్తానికి ఈ సంక్రాంతికి ఈ సినిమా సరిలేరు నాకెవ్వరు అనిపించుకుంటుందా లేదా చూడాలి.